బీజేపీలోకి మాజీ ఎంపీ.. రమేష్ రాథోడ్

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ బీజేపీ రాష్ట్ర వ్వవహారాల ఇంచార్జి తరుణ్‍చుగ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో జాతీయ మహిళ ఉపాద్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర మాజీ అధ్యక్షులు లక్ష్మణ్, వివేక్, టీఆర్‍ఎస్ తిరుగుబాటు నాయకుడు ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్, ఎంపీ సోయంబాపు రావులు ఉన్నారు. ఈ నెల 14న బీజీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఇందుకు బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం స్వాగతించినట్లు రమేవ్ రాథోడ్ తెలిపారు. అయితే కొవిడ్ నిబంధనల వలన ఢిల్లీలో నడ్డా సమక్షంలో బీజేపీ చేరి అనంతరం ఖానాపూర్ నియోజకవర్గంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించన్నుట్లు రమేశ్ రాథోడ్ పేర్కొన్నారు.