Etala Rajender: తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదు… నాయకులే : ఈటల

తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదని, నాయకులు వెనుకబడేసిన ప్రాంతమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే ఈ ప్రాంతంలో రైల్వే(Railway), విద్యుత్ (electricity), టెలిఫోన్ (telephone) సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. ఒక వ్యక్తిని, ఒక పార్టీని దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణను దివాలా రాష్ట్రంగా చూపొద్దన్నారు. ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy )వ్యాఖ్యల నేపథ్యంలో ఈటల స్పందించారు.
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ (Telangana) దివాలా తీసిన రాష్ట్రమని సీఎం రేవంత్ పేర్కొనడం సరికాదు. ధాన్యం దిగుబడి, జీఎస్‌డీపీ, వృద్ధిరేటు, అత్యధిక బడ్జెట్‌స్థాయి వంటి అంశాల్లో అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం ధ్వంసం చేస్తున్నారు. కొత్త రాష్ట్రమే అయినా తడబాటు లేకుండా గొప్పగా పురోగమిస్తున్నామని గతంలోనే చెప్పాను. 2014లోనే తెలంగాణ సొంత పన్నుల ఆదాయం రూ.29 వేల కోట్లు. ఏటా రూ.5వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం పెరిగేది. 2023-24లో రూ.1.19 లక్షల కోట్ల ఆదాయం రాష్ట్రానికి వచ్చింది. పన్నేతర ఆదాయం కూడా 2014లోనే రూ.6వేల కోట్లు 2023-24లో రూ.20 వేల కోట్లు ఉంది. కేంద్రం పంపిణి చేసే పన్నుల ఆదాయం కూడా క్రమంగా పెరుగుతోంది అని తెలిపారు.