Drones: శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో డ్రోన్లపై నిషేధం

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport) పరిధిలో డ్రోన్ల (Drones) వినియోగంపై నిషేధం విధించారు. విమానాశ్రయానికి 10 కి.మీ. పరిధిలో డ్రోన్లపై నిషేధం విధించినట్లు సైబరాబాద్ (Cyberabad) సీపీ అవినాశ్ మహంతి (CP Avinash Mohanty) వెల్లడిరచారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు. డ్రోన్లపై నిషేధం జూన్ (June) 9 వరకు అమల్లో ఉంటుందని చెప్పారు.