Basavatarakam : బసవతారకం పరిశోధన కేంద్రానికి ఎన్‌ఆర్‌ఐ దంపతులు రూ.10 కోట్ల విరాళం

క్యాన్సర్‌పై పరిశోధనలకు పెద్దపీట వేసేందుకు ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ విస్తరించి అత్యాధునిక పరిశోధనా పరికరాలను సమకూర్చాలని బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి(Basavatarakam Indo American Cancer Hospital), రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ( బీఐఏసీహెచ్ అండ్ ఆర్‌ఐ) నిర్ణయించింది. అందుకు అమెరికాకు చెందిన డా.రాఘవేంద్ర ప్రసాద్(Dr. Raghavendra Prasad) , కల్యాణి ప్రసాద్ (Kalyani Prasad ) దంపతులు రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు. ఆసుపత్రిలో వారు బీఐఏసీహెచ్ అండ్ ఆర్‌ఐ చైర్మన్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna ) కు రూ.5 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా డా.రాఘవేంద్ర ప్రసాద్, కల్యాణి ప్రసాద్ దంపతులను బాలకృష్ణ సన్మానించారు. కొత్తగా నెలకొల్పనున్న కేంద్రానికి కల్యాణి ప్రసాద్ పరిశోధనా కేంద్రం (Kalyani Prasad Research Center) గా నామకరణం చేయనున్నారు.