తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పవన్ కల్యాణ్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి పవన్ వెళ్లారు. రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం రూ.కోటి విరాళాన్ని ఇటీవల పవన్ ప్రకటించారు. దానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.