TDC: డెంటిస్టులు సౌందర్య సర్జరీలు చేయొచ్చు.. తెలంగాణ డెంటల్ కౌన్సిల్ కౌంటర్

డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI) ప్రమాణాల ప్రకారం శిక్షణ పొందిన ఓరల్-మాక్సిలోఫేషియల్ సర్జన్లు (OMFS) ప్లాస్టిక్ సర్జరీ వంటి సౌందర్య ప్రక్రియలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తదితర చికిత్సలు చేయడానికి అర్హత కలిగి ఉంటారని తెలంగాణ డెంటల్ కౌన్సిల్ (TDC) స్పష్టం చేసింది. డెంటిస్టులు ఇలాంటి ప్రక్రియలు చేయకూడదంటూ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) జారీ చేసిన సర్క్యులర్‌కు ప్రతిస్పందనగా ఈ నోటీసు జారీ చేసినట్లు కనిపిస్తోంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఇతర సౌందర్య చికిత్సలు చేయడానికి దంతవైద్యులు, నోటి సర్జన్లకు “తగిన శిక్షణ లేదు” అని టీజీఎంసీ పేర్కొంది. ఈ క్రమంలోనే టీడీఎస్ వివరణ ఇచ్చింది. “ఓరల్ మరియు మాక్సిల్లోఫేషియల్ సర్జన్లు నోరు, దవడలు, ముఖం మరియు మెడను ప్రాంతాల్లో ఎన్నో చికిత్సలు చేయడంలో నిపుణులైన సర్జన్లు” అని టీడీఎస్ నోటీసు పేర్కొంది. ఈ సర్జన్లు చిన్న నోటి శస్త్రచికిత్సలు చేయడానికి, మృదు కణజాల గాయాలు, పగుళ్లు, తుపాకీ గాయాలు, దవడలు, ముఖం సౌందర్య వైకల్యాలకు శస్త్రచికిత్సలతోపాటు ప్లాస్టిక్ సర్జరీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి ముఖ సౌందర్య సర్జరీలు చేయడానికి శిక్షణ పొంది ఉంటారని టీడీఎస్ తన నోటీసులో పేర్కొంది.