తెలంగాణలో 1122 కు చేరిన కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గురువారం కొత్తగా 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన 12 మంది ఉండగా, మిగిలిన ముగ్గురికి ముంబైకి వలసవెళ్లి వచ్చినవారిగా గుర్తించారు. 45 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1122కు చేరింది. వీరిలో 29 మంది మృతిచెందగా, 693 మంది డిశ్చార్జి అయ్యారు. 400 మంది చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. వైరస్‌పై ఏమైనా సందేహాలుంటే 104, మానసిక ఇబ్బందులు తలెత్తితే 108కు కాల్చేసి సలహాలు, సహాయం పొందాలని పేర్కొన్నది.






