Harish Rao: ఆ కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలి : హరీశ్ రావు
శాసనసభ నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫలం చెందిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదు. డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని గాలికి వదిలేశారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పును బేఖాతరు చేస్తున్నారు. రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదు. శాసనసభ పనిదినాలు తగ్గిపోయాయి. అవసరమైనన్ని రోజులు సభను నిర్వహించడం లేదు. అకారణంగా వాయిదా వేస్తున్నారు. సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సభ్యులకున్న ప్రధాన క్వశ్చన్ అవర్, జీరో అవర్ నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ, ఆ కమిటీని తిరిగి ఏర్పాటు చేయలేదు. తక్షణమే అసెంబ్లీ (Assembly) నిర్వహణలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు.
– NS GOUD






