రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ … షబ్బీర్ అలీకి సీఎం విషెస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విందు ఆరగించారు. కాగా, రంజాన్ పర్వదినం లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని పేర్కొన్నారు.