Revanth Reddy: హైదరాబాద్‌కు దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదు : సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఫ్యూచర్ సిటినీ అందిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఇండస్ట్రియల్ పార్కు (Industrial Park), మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ (Malabar Gems and Jewellery) తయారీ యూనిట్‌ను మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridharbabu)తో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ, తమిళనాడు, కేరళ పోటీపడుతున్నాయని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుంది. హైదరాబాద్ (Hyderabad)కు దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదు. ప్రపంచ నగరాలతోనే పోటీ. రానున్న వందేళ్లను దృష్టిలో పెట్టుకుని విజన్ -2047 ప్రణాళికను రూపొందించుకున్నాం. నగర అభివృద్ధి కోసం దేశ, విదేశాలకు చెందిన కన్సల్టెంట్స్ పనిచేస్తున్నాయి. పెట్టుబడిదారులకు రక్షణ కల్పించి వారి వ్యాపారం లాభాల్లో సాగేలా సహకరిస్తున్నాం అని తెలిపారు.