Hyderabad: హైదరాబాద్ కు అలాంటి పరిస్థితి రానివ్వను : సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో పలు మెట్రో పాలిటన్ నగరాల్లో జీవించలేని పరిస్థితులు నెలకొంటున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. సికింద్రాబాద్ బుద్ధభవన్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ (Hydra Police Station)ను సీఎం ప్రారంభించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ (Hyderabad) కు అలాంటి పరిస్థితి రానియొద్దని భావించి హైడ్రాను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. బెంగళూరు (Bangalore)లో గత ఏడాది వేసవిలో నీటి కరవు వచ్చింది. ముంబయి (Mumbai), చెన్నై వంటి నగరాల్లో వరదలు వస్తే 2, 3 అంతస్తుల భవనాలు సైతం మునిగిపోయిన పరిస్థితుల్ని మనం చూశాం. దేశ రాజధాని ఢల్లీిలో కాలుష్యం పెరిగిపోయి జీవించలేని పరిస్థితి నెలకొంటున్నాయి. ఈ ఉపద్రవం నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే నష్టం జరుగుతుంది. అందుకే అలాంటి నగరాల సరసన హైదరాబాద్ చేరకూడదనే ఉద్దేశంతోనే ఎవరెన్ని విమర్శలు చేసినా ఆక్రమణలను నియంత్రించదలచుకున్నాం అన్నారు.