Revanth Reddy : టీటీడీ బోర్డు మాదిరిగా తెలంగాణలోనూ.. వైటీడీ

తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy )తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రూ.1500 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రిని తిరిగి యాదగిరిగుట్ట (Yadagirigutta)గా మార్చాం. కొండపై భక్తులు నిద్రించేలా, ఆటోలు నడిచేలా చేస్తాం. 60 కిలోల బంగారంతో ఆలయ గోపురం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. టీటీడీ బోర్డు (TTD Board) మాదిరిగా తెలంగాణలోనూ వైటీడీ (YTD) ఏర్పాటు చేశాం. యాదగిరిగుట్టలోని విద్యాసంస్థలను వర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తాం. ఎవరు అడ్డం పడినా సరే, మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ రైతులను ఆదుకుంటాం. గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతాం. సబర్మతి (Sabarmati), గంగా నదులు (Ganga rivers) ప్రక్షాళన చేసుకోవచ్చు. మూసీ నదిని మాత్రం ప్రక్షాళన చేయకూడదా? అని ప్రశ్నించారు.