Revanth Reddy: డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి

వచ్చే మూడేళ్లలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, సబ్‌స్టేషన్లు అప్‌గ్రేడ్ (Substations upgrade ) చేసుకోవాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సూచించారు. విద్యుత్‌శాఖపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. భవిష్యత్‌లో డేటా సెంటర్ల హబ్ (Data Center Hub)గా హైదరాబాద్ మారబోతోంది. విద్యుత్ లైన్ల ఆధునికీకరణపై దృష్టి సారించాలి. ప్యూచర్‌సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి. అక్కడ విద్యుత్ టవర్లు, లైన్లు, స్తంభాలు కనిపించకూడదు. గ్రేటర్ పరిధిలో స్మార్ట్‌పోల్స్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలి. ఓఆర్‌ఆర్‌లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలి అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. గతేడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందన్నారు. 2025-26 లో విద్యుత్ డిమాండ్ 18,138 మెగావాట్లకు పెరుగుతుందని, 2034-35 నాటికి విద్యుత్ డిమాండ్ 31,808 మెగావాట్లకు చేరుతుందని అధికారులు వివరించారు.