Miss World : మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై ..సీఎం రేవంత్ సమీక్ష

మిస్‌వరల్డ్(Miss World) -2025 పోటీల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు సీఎంకు వివరించారు. మే 10న పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అతిథులకు, పోటీల్లో పాల్గొంటున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎయిర్‌పోర్టు(Airport) , హోటళ్లు (hotels), చారిత్రక కట్టడాల వద్ద కట్టుదిట్టమైన భద్రత (Security) ఉండాలన్నారు. అతిథులు పర్యాటక ప్రాంతాలు సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగర సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.