Revanth Reddy: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి

కుల గణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర క్యాబినెట్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం నిర్ణయంతో రాహుల్ గాంధీ (Rahul Gandhi) విజన్ సాకారం కాబోతోందని పేర్కొన్నారు. రాహుల్ విపక్షంలో ఉండి కూడా కేంద్ర విధానాన్ని ప్రభావితం చేశారు. దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణే (Telangana) . రాహుల్ విజన్‌తో రాష్ట్రంలో కులగణన చేపట్టాం. కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ (Congress Party ) దేశవ్యాప్తంగా పోరాడిరది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢల్లీిలోనూ ఆందోళన చేశారు. తెలంగాణ చేసింది. దేశం అనుసరిస్తోందని మరోసారి రుజువైంది అన్నారు.