Revanth Reddy : హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్

సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హైకోర్టు (High Court ) లో పిటిషన్ దాఖలు చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు 2021లో పీసీసీ (PCC) ఆధ్వర్యంలో రాజ్ భవన్ (Raj Bhavan) ముట్టిడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ (Saifabad Police Station ) లో ఆయనపై కేసు నమోదైంది. రేవంత్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు (case) నమోదు చేశారు. ప్రస్తుతం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండిరగ్‌లో ఉంది. ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డికి హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.