గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై గవర్నర్‌తో చర్చించారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశం చర్చకు వచ్చాయి. బిల్లులు, మంత్రివర్గ విస్తరణపై గవర్నర్, సీఎం చర్చించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి వెంట ఆయన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.