Ujjaini Mahankali :మహంకాళి బోనాలకు రండి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి (Ujjaini Mahankali) అమ్మవారి బోనాల జాతరకు హాజరు కావాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి ఆహ్వానం అందింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ అర్చకులు, సీఎంను ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. కాగా, ఈ నెల 29న అమ్మవారి ఎదుర్కోలు కార్యక్రమం ఉండగా, జూలై 13న మహంకాళి బోనాలు జరగనున్నాయి.