PJR Flyover: పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

కొండాపూర్ నుంచి ఓఆర్‌ఆర్ వరకు నిర్మించిన పి.జనార్దన్‌రెడ్డి ( పీజేఆర్) ఫ్లైఓవర్ (PJR Flyover ) ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) ప్రారంభించారు. ఆరు వరుసలు, 24 మీటర్ల వెడల్పుతో 1.2 కి.మీ నిర్మించిన ఈ పైవంతెన అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి జంక్షన్ (Gachibowli Junction) వద్ద ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు ఊరట లభించింది. ఓఆర్‌ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్‌పేట మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. హైటెక్ సిటీ (Hi-tech City), ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ లభించింది. కొండాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport), అక్కడి నుంచి కొండాపూర్ ప్రాంతాలకు ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లే వెసులుబాటు ఈ ఫ్లైఓవర్ ద్వారా కలిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే గాంధీ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.