Revanth Reddy: నాయకులుగా ఎదగాలంటే… ఇప్పటి నుంచే : సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ పదవులను నేతలు సాధారణంగా తీసుకోవద్దని, వాటితోనే గుర్తింపు, గౌరవం వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాజకీయాల్లో ఎదిగేందుకు అవి ఉపయోగపడతాయని చెప్పారు. తెలంగాణ (Telangana)లో వచ్చే పదేళ్లు మన పార్టీయే అధికారంలో ఉంటుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. నేను పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు 45 లక్షల సభ్యత్వాలు చేశాం. యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ విభాగాల వారితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి ప్రభుత్వంలో వచ్చాయి. రానున్న రోజుల్లో అసెంబ్లీ(Assembly), పార్లమెంట్ (Parliament) సీట్లు పెరగబోతున్నాయి. మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికలు (Jamili elections) ప్రభావితం చేయబోతున్నాయి. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలి. నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి సమన్వయంతో పనిచేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో చాలా విజయాలు సాధించాం. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలి. కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తేవాలి అని అన్నారు.