Revanth Reddy: సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్…
మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా పుష్కరాలను నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ (Telangana) ఏర్పడిన తరువాత తొలిసారిగా సరస్వతి పుష్కరాలు (saraswathi pushkaralu) నిర్వహించుకుంటున్నాం. నా హయాంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తున్నా. నదులు మన నాగరికత మాత్రమే కాదు.. నదిని మనం దేవుడిగా భావిస్తాం. రాబోయే రోజుల్లో గోదావరి, కృష్ణా పుష్కరాలను నిర్వహించుకుందాం. మంథని నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.
మన దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రపంచంలోనే నాలుగో స్థానానికి తీసుకెళ్లడంలో పీవీ ఎనలేని కృషి చేశారు. ఆ తరువాత ఆ స్థాయిలో దుద్దిళ్ల శ్రీపాదరావు గారు మంథని పేరు నిలబెట్టారు. ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి మంథని ప్రతిష్టను మరింత పెంచారు. బలిష్టమైన ఆర్ధిక రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టేందుకు మరింత పనిచేసేందుకు ఆయనకు మంథని ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. రాబోయే గోదావరి పుష్కరాలకు అవసరమైతే 200 కోట్లు కేటాయించి ఈ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. ఇందుకు గ్రీన్ ఛానల్ లో నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అభివృద్ధి కోసం పనిచేసే శ్రీధర్ బాబు లాంటి నాయకుడు ఉండటం ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టం.