Revanth Reddy: వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

సమకాలీన రాజకీయాల్లో అధికారం ఉన్నపుడు మిత్రులు గా వస్తారు..అధికారం పోయాక మాయం అవుతారు. చదువుకునే రోజుల నుండిమరణం వరకు వైఎస్ కి కేవీపీ రామచంద్ర రావు తోడు నీడగా నిలబడ్డారు. రైతుల కోసం, వ్యవసాయం దండగ కాదు పండుగ అని చెప్పడానికి వైఎస్ (YSR) పని చేశారు. కేవీపీ రామచంద్ర రావు లాగా ఉంటానని కొంతమంది నా దగ్గరకి వస్తున్నారు.. ఈ తరానికి ఒకే వైఎస్, ఒకే కేవీపీ ఉంటారు..వారికి ప్రత్యామ్నాయం లేదు. తప్పులను తన ఖాతాలో, మంచిని వైఎస్ ఖాతాలో కేవీపీ (KVP) వేసేవారు. సర్వం త్యాగం చేయగల గుణం,సమస్యలను ఎదురుకునే శక్తి కేవీపీ కి ఉంది.
దేశం లో ఏ రాష్ట్రం లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే అన్నట్లుగా వైఎస్ ప్రభావితం చేశారు. ఉచిత విద్యుత్ పైన తొలి సంతకం చేయడం తో పాటు రైతుల విద్యుత్ బకాయి లను,వారి పైన పెట్టిన కేసు లను వైఎస్ రద్దు చేశారు. 2 రూపాయల కు కిలో బియ్యాన్ని రూపాయి కె ఇచ్చారు. ఉచిత కరెంట్ అంటేనే వైఎస్ పేరు గుర్తుకు వస్తుంది. ఫీజు రీయంబర్స్ మెంట్,ఆరోగ్య శ్రీ వంటి పథకాలను ఎవరు అధికారం లోకి వచ్చినా కొనసాగించాల్సి వస్తుంది.
తెలంగాణ లో 3.10 కోట్ల మందికి ఉచితం గా సన్న బియ్యం ఇస్తున్నాం. ఇందులో వైఎస్ స్ఫూర్తి ఉంది. అధికారం లోకి వచ్చిన 3 నెలలోనే 2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తాం. 25,35,694 మంది రైతులకు 20,617 కోట్ల రుణ మాఫీ చేసి రుణ విముక్తి కల్పించాం. వరి వేస్తే ఊరే అని గత సీఎం అంటే మేం వరి వేస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చాం, చివరి గింజ వరకు కొన్నాం. రాష్ట్రం లో ప్రకృతి వ్యవసాయంకోసం ప్రణాళికలు తయారు చేస్తాం.
తెలంగాణ లో కరవు, వలసలను నివారించడం కోసం గోదావరి జలాలను తీసుకు రావడానికి వైఎస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ను చేపట్టారు. నల్గొండ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం ఎస్ ఎల్ బీ సీ ని వైఎస్ చేపట్టారు. 30 కిలో మీటర్ల సొరంగం తవ్విన తర్వాత పనులు ఆపేశారు. ఎస్ ఎల్ బీ సీ ని మా ప్రభుత్వం పూర్తి చేసి రైతుల కలను నెరవేరుస్తుంది. నా జీవిత ఆశయం రాహుల్ గాంధీ ని ప్రధాని చేయడమేనని వైఎస్ గతం లో ప్రకటించారు. నేను, వైఎస్ షర్మిల రాహుల్ గాంధీ ని ప్రధాని చేయడం కోసం అవిశ్రాంతంగా పని చేస్తాం.
వైఎస్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ప్రతిపక్ష ఎం ఎల్ ఏ గా అసెంబ్లీ లో బడ్జెట్ పైన ప్రభుత్వాన్ని నిలదీశాను. మొదటి సారి ఎం ఎల్ ఏ అయినప్పటికీ నా విమర్శలకు వైఎస్ సభ లో సమాధానం ఇచ్చారు. కోపం అనే నరం తెగిపోయిందని వైఎస్ చెప్పారు. అధికారం లో ఉన్నపుడు అహంకారం లేకుండా ఆలోచన తో ప్రతిపక్షాలకు వైఎస్ సమాధానం చెప్పారు..