Revanth Reddy : దేశ రక్షణలో హైదరాబాద్ కీలక పాత్ర : సీఎం రేవంత్ రెడ్డి

దేశ రక్షణ బాధ్యత యువతపైనే ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన విజ్ఞాన్ వైభవన్ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh) తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణలో హైదరాబాద్ దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. దేశ రక్షణలో తెలంగాణ (Telangana) పాత్ర కీలకంగా ఉందన్నారు. బీడీఎల్ (BDL) , హెచ్‌ఏఎల్(HAL) , మిధాని (MIDHANI) వంటి కీలక సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సైన్స్ ప్రదర్శన వల్ల విద్యార్థులు, యువతకు దేశరక్షణ పట్ల అవగాహన కలుగుతుందన్నారు. ప్రస్తుతం యువత ఐటీ ఉద్యోగాలపైనే మొగ్గు చూపుతోందని, సంప్రదాయ ఇంజనీరింగ్ విద్యపై కూడా విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.