Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో స్విట్జర్లాండ్ రాయబారి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని స్విట్జర్లాండ్ రాయబారి మాయా తిస్సాఫీ (Maya Tissafi ) మర్యాదపూర్వకంగా కలిశారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం ఆమెకు వివరించారు. స్విట్జర్లాండ్-తెలంగాణ మధ్య స్నేహపూర్వక భాగస్వామ్యం, పారిశ్రామిక సహకారం, పెట్టుబడుల అవకాశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ రఘువీర్‌రెడ్డి (MP Raghuveer Reddy) , టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి (Vishnuvardhan Reddy), సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ స్నేహజ తదితరులు పాల్గొన్నారు.