Revanth Reddy: సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనాస్థలి వద్ద మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇది అత్యంత విషాదకరమైన దుర్ఘటన. ఇప్పటివరకు ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన రాష్ట్రంలో జరగలేదు. ఇప్పటి వరకు 36 మంది చనిపోయారు.. 143 మంది ఉన్నారు… 58 మందిని అధికారులు గుర్తించారు.. మిగిలిన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించా. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10 లక్షలు, పాక్షికంగా గాయపడినవారికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశించా. గాయపడినవారికి మెరుగైన చికిత్సఅందించాలని ఆదేశించాం. ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటాం. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళ్తాం. ఇలాంటి ఘటనలు జరగకుండా కంపెనీల్లో పీరియాడికల్ ఇన్స్పెక్షన్ చేయాలని అధికారులను ఆదేశించాం. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించాం.