MP Chamala: రూ.13 లక్షల కోట్లు ఇస్తే…. రూ.8 లక్షల కోట్లు అప్పు ఎందుకు : ఎంపీ చామల
కేంద్రం నుంచి తెలంగాణకు రూ.13 లక్షల కోట్ల నిధులు వచ్చాయంటున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy), ఏ శాఖకు ఆ నిధులు తెచ్చారో చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (Chamala Kiran Kumar Reddy) సవాల్ విసిరారు. దొంగ లెక్కలు చెప్పడం కాదని, తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు వస్తే రూ.8 లక్షల కోట్ల అప్పు ఎందుకైందని ప్రశ్నించారు. తెలంగాణను కేసీఆర్ (KCR) కుటుంబం దోచుకుంటుంటే, రాష్ట్రం అప్పుల పాలవుతుంటే, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించి రాష్ట్రాన్ని రక్షించే ప్రయత్నం కిషన్‌రెడ్డి ఎందుకు చేయలేదని నిలదీశారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలుచేస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మంచి జరుగుతుంటే బీజేపీ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని దుయ్యబట్టారు. గ్లోబల్ సమ్మిట్‌కు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు హాజరై ప్రతినిధులకు భరోసా కల్పించాలని సూచించారు. దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికుల ఇబ్బందులకు ఇండిగో యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని, ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
– NS GOUD






