Kavitha: రాజీనామాపై పునరాలోచించుకోండి.. ఎమ్మెల్సీ కవితకు మండలి చైర్మన్ సూచన
భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దని, రాజీనామాపై పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha)కు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి (Gutta Sukhender Reddy) సూచించారు. ప్రశ్నోత్తరాల అనంతరం సభలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలపై కవిత వివరణ ఇస్తూ భావోద్వేగానికి గురయ్యారు. గత సెప్టెంబరు (September) 3వ తేదీనే చైర్మన్ ఫార్మాట్లో రాజీనామా లేఖ (Resignation letter) పంపినట్టు తెలిపారు. ఇప్పటికైనా తన రాజీనామా ఆమోదించాలని కోరారు. దీనిపై చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ భావోద్వేగాలతో కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, మరోసారి ఆలోచించుకోవాలని సూచించారు.






