I&PR: సమాచార పౌర సంబంధాల ప్రత్యేక కమిషనర్ గా ప్రియాంక బాధ్యతల స్వీకారం

తెలంగాణ సమాచార పౌర సంబంధాల ప్రత్యేక కమిషనర్ గా సి.హెచ్. ప్రియాంకా (Ch Priyanka) బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటిదాకా సమాచార ప్రసారశాఖ స్పెషల్ కమీషనర్ గా ఉన్న డా. హరీష్ ను తెలంగాణ జెన్కో ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న సి.హెచ్. ప్రియాంకను సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో డా, హరీష్ నుండి ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీగా, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ తోపాటు తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ప్రియాంక భాద్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ప్రియాంకకు సమాచార శాఖ, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, మీడియా అకాడమీ అధికారులు అభినందనలు తెలిపారు.