CDK Global: సీడీకే ఇండియా ‘కన్వర్జెన్స్ 2025’ వేడుకలు.. కుటుంబ బంధాలను పెంపొందించిన 10వ ‘ఫ్యామిలీ డే’

ప్రముఖ ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్‌వేర్ సంస్థ CDK ఇండియా, వార్షిక ‘ఫ్యామిలీ డే’ కార్యక్రమం ‘కన్వర్జెన్స్ 2025’ను విజయవంతంగా నిర్వహించింది. JRC కన్వెన్షన్‌లో ప్రశంస, వినోదం, సామూహిక బంధం కలగలిసిన సాయంత్రం ఇది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఇందులో పాలుపంచుకున్నారు. సంస్థ సాంస్కృతిక ప్రస్థానంలో ఇది ఒక ముఖ్య ఘట్టం. CDK ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ జైన్ స్వాగత ప్రసంగంతో వేడుక ప్రారంభమైంది. “CDKలో మా విలువలైన ఉత్సుకత, మా ప్రయాణానికి బాధ్యత వహించడం, నిష్కాపట్యం, అవకాశాలు సృష్టించడం – మా ప్రతి పనికి మార్గదర్శకాలు. ప్రతి ధైర్యమైన ఆలోచన, పురోగతి వెనుక, మా కుటుంబాలు ఉన్నాయి. అవి మా ఉత్సుకతను ప్రేరేపిస్తాయి, మా బాధ్యతకు మద్దతు ఇస్తాయి. మా అవకాశాలను విశ్వసిస్తాయి.
ఈ రోజు, మేము మా ఉద్యోగులను మాత్రమే కాదు – మా విలువలను నిత్యం జీవం పోసే ప్రేమ, సహనం, బలానికి గౌరవం ఇస్తున్నాం” జైన్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, ADP మాజీ మేనేజింగ్ డైరెక్టర్ శక్తి సాగర్ను జైన్ సన్మానించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ, “కుటుంబం అంటే కేవలం రక్తసంబంధం కాదు. అవసరమైనప్పుడు మనకు అండగా నిలిచే వారు. అనేక విధాలుగా, మనం పని చేసే వారే మనకు రెండవ కుటుంబం అవుతారు. కన్వర్జెన్స్ వ్యక్తిగత కుటుంబాలు, వృత్తిపరమైన కుటుంబాలను ఒకచోట చేర్చడం. వాటిని కలిపే బంధాన్ని వేడుకగా జరుపుకోవడమే” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో థీమ్ ఆధారిత ఫ్యాషన్ వాక్, ఉద్యోగుల గాన ప్రదర్శనలు, సమూహ నృత్యాలు, ‘కన్వర్జెన్స్’ తయారీని చూపించే తెరవెనుక డాక్యుమెంటరీ సహా అనేక ఉత్సాహభరిత, హృదయాన్ని హత్తుకునే క్షణాలు ఉన్నాయి.
CDK సీనియర్ నాయకత్వ బృందం ప్రదర్శన ఈ సాయంత్రం ఒక ప్రత్యేక ఆకర్షణ. వారు తేలికపాటి స్కిట్, డ్యాన్స్ రొటీన్, ప్రత్యక్ష గానం ప్రదర్శించారు. ఇది ప్రేక్షకుల అభిమానం చూరగొంది, వారి సహజత్వం, హాస్యం గొప్ప ప్రశంసలు అందుకున్నాయి. అధికారిక గుర్తింపు, రివార్డుల విభాగం వివిధ పాత్రలు, బృందాలలో అసాధారణమైన కృషిని సత్కరించింది. ఇది సంస్థ ప్రశంస సంస్కృతిని మరింత బలోపేతం చేసింది. సీనియర్ డైరెక్టర్, మానవ వనరుల అధిపతి శ్రీ ఆశిష్ సక్సేనా ముగింపు ప్రసంగం చేశారు. “ఈ సాయంత్రం ఒక సమావేశం కన్నా ఎక్కువ – ఇది CDKలో మనం కలిసి నిర్మించుకున్న సంస్కృతికి ప్రతిబింబం. ప్రతి ప్రదర్శన, ప్రతి సహాయం, ప్రతి చిరునవ్వు మనం జీవించే విలువలను తెలియజేస్తాయి. ఉత్సుకత, బాధ్యత, అవకాశాలు సృష్టించే తపన ఇక్కడ ఉంది. కన్వర్జెన్స్ కేవలం ఒక కార్యక్రమం కాదు. వేదికపై, తెరవెనుక మన లక్ష్యాన్ని జీవం పోసే వ్యక్తుల వేడుక” అని సక్సేనా పేర్కొన్నారు.