Dallas: డాలస్ లో బీఆర్‌ఎస్ రజతోత్సవ సంబురాలు

అమెరికాలోని డాలస్ నగరంలో జూన్ 1న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Celebration)ను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) తెలిపారు. తెలంగాణ భవన్‌లో డాలస్ (Dallas)లో నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సంబురాల పోస్టర్‌ను బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల (Mahesh Bigala), ఎమ్మెల్యే కే సంజయ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ (Dasoju Sravankumar) తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలు రాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరవుతాయని తెలిపారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన పదేండ్ల పాలనలో అనేక అద్భుతాలు సాధించి చూపారని పేర్కొన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. వరంగల్‌లోని ఎలతుర్తిలో జరిగిన రజతోత్సవ బహిరంగ సభ కనీవినీ ఎరుగని రీతిలో ఎంతో అద్భుతంగా జరిగిందని గుర్తు చేశారు. ఎన్‌ఆర్‌ఐలుగా ఉండి ప్రపంచ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ రజతత్సవ సంబురాలు జరిపేందుకు ముందుకు రావడం మంచి పరిణామని అభినందించారు. అమెరికాతో పాటు యూకే, కెనడా, ఆస్ట్రేలియాలోనూ బీఆర్‌ఎస్ రజతోత్సవ సంబురాలు ఏడాది పొడవునా ఘనంగా జరుగుతాయని పేర్కొన్నారు.