Mahesh Bigala: మహేశ్ బిగాలను ప్రత్యేకంగా అభినందించిన కేసీఆర్

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. పార్టీ ఎన్నారై సెల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల(Mahesh Bigala)ను ప్రశంసించారు. అమెరికాలోని డాలస్ (Dallas)లో ఇటీవల నిర్వహించిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ(BRS Silver Jubilee Celebration) విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించిన మహేశ్ బిగాల మంగళవారం కేసీఆర్(KCR) ను ఎర్రవల్లి (Erravalli) లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. కేసీఆర్‌కు డాలస్ సభ తీరుతెన్నులు, వచ్చిన స్పందనను ఆయన వివరించారు. ఈ సందర్భంగా మహేశ్ బిగాలను కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.