Minister Jupally : మంత్రి జూపల్లితో నటుడు గగన్ మాలిక్ భేటీ
తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ను బాలీవుడ్ నటుడు, జీటీవీ రామాయణంలో రాముడి పాత్రధారి, బుద్ధిజం ప్రచారకుడు గగన్ మాలిక్ (Gagan Malik) మర్యాదపూర్వకంగా కలిశారు. బేగంపేట టూరిజం ప్లాజా (Begumpet Tourism Plaza) లో ఈ భేటీ జరిగింది. బుద్ధవనం ప్రాజెక్టు, బౌద్ధ దేశాల పర్యాటకులను బుద్ధవనానికి రప్పించడం తదితర అంశాలపై వారు చర్చించారు. బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య (Mallepally Lakshmaiah) పాల్గొన్నారు.







