Purandeshwari: మాపై నమ్మకంతో ఎన్డీయేను మూడుసార్లు గెలించారు : పురందేశ్వరి

ప్రజలు తమపై నమ్మకంతో కేంద్రంలో మూడుసార్లు ఎన్డీయే కూటమిని గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంద్వేశరి (Purandeshwari)అన్నారు. ప్రభుత్వ సుపరిపాలన, పేదల సంక్షేమంపై రాజమహేంద్రవరం (Rajahmundry)లో ఆమె సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 2047 నాటికి మనం వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రధాని మోదీ (Prime Minister Modi) ఏ పథకం చేపట్టినా పేదలను కేంద్ర బిందువుగా చేసుకొని కార్యక్రమాలు చేపడతారు. గతంలో కేవలం ఏడు కోట్ల మంది మాత్రమే బ్యాంకింగ్ (Banking) రంగానికి దగ్గరగా ఉండేవారు. ప్రస్తుతం 52 కోట్ల మందికి సేవలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా 15 కోట్ల మందికి జలజీవన్ మిషన్ (Jaljeevan Mission) కింద మంచినీటి సరఫరా జరుగుతోంది. 12 కోట్ల మందికి మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాం అని తెలిపారు.