Dharmapuri Arvind : స్థానిక సంస్థల ఎన్నికల కోసమే .. బీజేపీపై : ఎంపీ ధర్మపురి అర్వింద్

బనకచర్లతో తెలంగాణకు జరిగే అన్యాయమేంటో చెప్పామంటే రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) దగ్గర సమాధానం లేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind )అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డైవర్షన్ రాజకీయాల కోసం ఆయన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమం పెట్టారని విమర్శించారు. బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా వినతిపత్రాలను స్వీకరించాం. అనేక మంది దివ్యాంగులు వచ్చి తమ సమస్యలు తెలిపారు. వారికి ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. ప్రతి పల్లెలో కాంగ్రెస్ ఇమేజ్ భూస్థాపితం అయింది. ఉత్తమ్‌కుమార్ రెడ్డి సగం కాంగ్రెస్, సగం బీఆర్‌ఎస్. కేసీఆర్ (KCR) డైరెక్షన్‌లో తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు ఆయన చేస్తున్న పని పవర్ పాయింట్ ప్రజంటేషన్. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే నాటకాలాడుతున్నారు. బీజేపీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను సిట్ పిలవలేదు. మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేశారో అర్థం కావడం లేదు అని అన్నారు.