Mamunur : మామునూర్ విమానాశ్రయం వద్ద ఉద్రికత్త

వరంగల్ జిల్లాలోని మామునూర్ (Mamunur ) వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు ఘర్షణకు దిగారు. వారి మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మామూనూర్ విమానాశ్రయ పనులకు ఇటీవల కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర అనుమతి ఇవ్వడంతో ప్రధాని మోదీ (Modi ) కి పూలాభిషేకం చేసేందుకు బీజేపీ (BJP ) శ్రేణులు అక్కడకి వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ (Congress) శ్రేణులు కూడా రావడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా విమానాశ్రయం(Airport) వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.