Missworld : పిల్లలమర్రిలో అందాలభామల సందడి

మిస్‌వరల్డ్ (Miss world )పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలు మహబూబ్‌నగర్ జిల్లా పిల్లలమర్రి (pillalamarri), రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరులోని ఎక్స్‌పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కు (Eco-friendly park)లో సందడి చేశారు. వివిధ దేశాలకు చెందిన 22 మంది ప్రపంచ సుందరీమ ణులు తొలుత మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ బృందానికి కలెక్టర్ విజయేందిర బోయి (Vijayendra Boi), ఎస్సీ జానకి (Janaki) ఘనస్వాగతం పలికారు. అనంతరం పిల్లలమర్రి చేరుకొని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. మ్యూజియం వద్ద ప్రపంచ సుందరీమణులతో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, మధుసూదన్‌రెడ్డి, పర్ణికారెడ్డి, వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి ఫొటో దిగారు. పిల్లలమర్రి ప్రాముఖ్యత గురించి స్క్రీన్ ద్వారా వివరించా రు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు. మిస్ వరల్డ్ ఆసియా`ఓషియానియా గ్రూప్ నుంచి 24 మంది సుందరీమణులు ప్రొద్దుటూరులోని ఎకో ఫ్రెండ్లీ పార్కును సందర్శించారు.
వీరిలో 2024 మిస్ వరల్డ్ కిరీటధారిని చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టీనా పిసోవా కూడా ఉన్నారు. అక్కడ ఉన్న అరుదైన మొక్కలు, వృక్షజాతులు శిల్పకళా సంపదను వీక్షించారు. అంతకు ముందు ప్రభుత్వం పర్యాటక శాఖ పార్కు, నిర్వహకుల ఆధ్వర్యంలో సంప్రదాయ బద్దంగా డోలు, మేళతాలాలతో సుందరీమణులకు స్వాగతం పలికారు. అనంతరం వారు పర్యావరణ అనుకూల బగ్గీలలో ఎక్స్‌పీరియం పార్కులో పర్యటించారు.