Bandi Sanjay: రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో కాంగ్రెస్ : బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా భావించే ముఖ్యమంత్రే రాష్ట్రం దివాలా తీసిందని పేర్కొనడం సిగ్గుచేటని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిరచారు. కరీంనగర్ (Karimnagar)లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దగా ప్రజల్లో ధైర్యం నింపాల్సిందిపోయి అధైర్యాన్ని నూరిపోస్తూ రాష్ట్రం పరువు తీస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం నడపలేమనే స్థితిలో కాంగ్రెస్ (Congress) ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే అడ్డగోలు హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఆరు గ్యారంటీలు అమలు చేయలేమని చేతులెత్తేశారని విమర్శించారు. కేంద్రమంత్రులు (Union Ministers) అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని సీఎం చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. ఎన్నికల్లో హామీలిచ్చిన రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.