Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి వస్తే .. బీసీ సీఎం : బండి సంజయ్

బీజేపీ ప్రజాస్వామ్య పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ ఎవరైనా వేసుకోవచ్చని అధిష్టానం చెప్పిన ప్రకారం నడుచుకోవాలని సూచించారు. బీజేపీ (BJP) అధిష్ఠానం ఇంకా అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించలేదు. బీజేపీ ఎవరో చెప్పారని అధ్యక్షుడిని నియమించే పార్టీ కాదు. అధిష్ఠానం చెప్పిన వ్యక్తే అధ్యక్షుడు (President) అవుతారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీసీని సీఎం (BC CM) చేస్తాం. అధిష్ఠానం నిర్ణయానికి కార్యకర్తలు కట్టుబడి ఉంటారు. దళితులను సీఎం చేస్తామని బీఆర్‌ఎస్ (BRS) మోసం చేసింది. ఆ పార్టీ బీసీలకు సీఎం, పార్టీ అధ్యక్ష పదవులు ఇస్తామని ప్రకటించగలదా? అని అన్నారు.