Balakrishna: తెలంగాణ గవర్నర్‌ను ఆహ్వానించిన బాలకృష్ణ

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి (Cancer Hospital) , పరిశోధనా సంస్థ 25వ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని గవర్నర్ జిష్టుదేవ్ వర్మ (Jishtudev Verma) ను ఆసుపత్రి చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna ) ఆహ్వానించారు. ఈ మేరకు రాజ్‌భవన్ (Raj Bhavan) లో గవర్నర్‌ను కలిసి పుష్పగుచ్చం అందించి వేడుకల్లో పాల్గొనవలసిందిగా కోరారు. వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడిరచాయి.