Missworld: హైదరాబాద్‌కు మిస్‌వరల్డ్ చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిస్‌వరల్డ్ (Missworld) -2025 పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు మిస్‌వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి (Julia Evelyn Morley) హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సంద్బంగా మోర్లికి శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport ) లో పర్యాటక శాఖ అధికారుల బృందం సంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం (welcome) పలికింది. శుక్రవారం సాయంత్రం నుంచే మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లను ఆమె సమీక్షించారు. వివిధ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లి సంబంధిత ఏజెన్సీలు, వివిధ విభాగాలతో మాట్లాడారు.