Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు (Sridhar Babu) కు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ (Asbiotech International Conference) 2025లో ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ (Hilary McGeachy) ఆ మేరకు ఆహ్వానం పలికారు. దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు కావడం గమనార్హం. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా (Australia) లోని మెల్‌బోర్న్‌లో సదస్సు జరగనుంది.ఈ రెండేళ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో సాధించిన పురోగతిపై శ్రీధర్ బాబు ప్రసంగించనున్నారు. తెలంగాణలో ఈ రంగంలో అనుకూలతలు, అవకాశాలపై మాట్లాడనున్నారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం ఆయనకు దక్కింది.