KTR: దేశానికి రాహుల్ గాంధీ ఇచ్చే హామీ ఇదేనా? : కేటీఆర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు (Burgampadu) మండంలో గిరిజన మహిళపై దాడి అమానుషమని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన సీఎం ఆలోచనలకు అద్ధం పడుతోందని విమర్శించారు. సీఎంగా అలాంటి వ్యక్తి ఉంటే రాజ్యాంగం ఎక్కడ అమలవుతుందని ప్రశ్నించారు. దేశానికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇచ్చే హామీ ఇదేనా? దేశ మహిళలకు ప్రియాంకగాంధీ (Priyanka Gandhi) ఇదే గౌరవం కోరుకుంటున్నారా? మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) మాట్లాడుతున్న సమానత్వం ఇదేనా అని ప్రశ్నించారు.