KTR: హరీష్ కోసం కేటిఆర్ పదవీ త్యాగం

తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని ఎదుర్కొని నిలబడాలని ప్రయత్నం చేస్తున్న భారత రాష్ట్ర సమితి వచ్చే ఎన్నికల నాటికి పక్క ప్లానింగ్ తో అదిరిపోయే గ్రౌండ్ వర్క్ తో ముందుకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించే విధంగా ఆ పార్టీ అధినేత కేసిఆర్ (KCR) ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు అలాగే శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్ ఇక అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అటు కేటీఆర్ (KTR) కూడా కేసులతో కాస్త సతమతమవుతున్నారు. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ముందు అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు హరీష్ రావుకి పార్టీ బాధ్యతలు అప్పగించి తాను వర్కింగ్ ప్రెసిడెంట్ గానే కొనసాగాలి అనే అభిప్రాయాన్ని కెసిఆర్ వద్ద కేటీఆర్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేటీఆర్ అరెస్టు అయ్యి ఒకవేళ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే మాత్రం పార్టీని ముందుకు నడిపించే బాధ్యతను హరీష్ రావు తీసుకోవాల్సి ఉంటుంది.
కెసిఆర్ ఎలాగో బయటకు రావడం లేదు కాబట్టి ఇప్పుడు హరీష్ రావు అలాగే కేటీఆర్ ఇద్దరు పార్టీని ముందు ఉండి నడిపిస్తున్నారు. ఇక హరీష్ రావుకు పార్టీలో ప్రాధాన్యత లేదని కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఆయన ఉన్నారనే అభిప్రాయాలు కూడా సీనియర్ నేతల్లో ఉన్నాయి. వీటన్నిటిని తొలగించి ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించి తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగితే మంచిదని, ఇక హరీష్ రావు లో కూడా నూతన ఉత్సాహం వచ్చి కష్టపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఉద్యమంలో పోరాటాలు చేసిన అనుభవంతో పాటుగా పార్టీ పరిస్థితిపై హరీష్ కు క్షేత్ర స్థాయి అవగాహన ఉంది. తాను జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే కేసీఆర్ ఎలాగూ బయటకు రావటం లేదు.. కాబట్టి ఆయనకు ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న కేటీఆర్ అధ్యక్ష బాధ్యతల కోసం ఆశపడకుండా వాటిని హరీష్ రావుకు వదిలిపెడితే భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు ఉండవు అనే భావనలో ఉన్నట్టు తెలుస్తుంది.