Jagruti: వివిధ దేశాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షుల నియామకం

తెలంగాణ జాగృతి (Jagruti) ఆధ్వర్యంలో ప్రవాస తెలంగాణ బిడ్డల సంక్షేమానికి కృషి చేయాలనే ఉద్దేశంతో వివిధ దేశాల శాఖలకు నూతన అధ్యక్షులను ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి, రాష్ట్ర సాధన అనంతరం తెలంగాణ అభ్యున్నతికి అంకితమైన సంస్థగా తెలంగాణ జాగృతి నిలిచిందని ఆమె పేర్కొన్నారు. బాధ్యతలు అప్పగించిన వారు తెలంగాణ అభ్యున్నతికి, ఆయా దేశాలలో ఉన్న తెలంగాణ ప్రవాసీల సంక్షేమానికి, సాంస్కృతిక వికాసానికి కృషి చేయాలని సూచించారు. ఈ నియామకాలన్నీ వెంటనే అమలులోకి వస్తాయని తెలిపారు. త్వరలోనే ఆయా దేశాల్లో పూర్తి స్థాయి కమిటీలను ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు.
న్యూజిలాండ్ అధ్యక్షురాలిగా అరుణజ్యోతి ముద్దం (Arunajyothi Muddam), గల్ఫ్ అధ్యక్షుడిగా చెల్లంశెట్టి హరిప్రసాద్ (Chellamsetty Hariprasad) ను నియమించారు. ఖతర్, యూఏఈ, కువై ట్, సౌదీఅరేబియా, ఒమన్, యునైటెడ్ కింగ్‌డమ్, ఇటలీ, ఫిన్లాండ్, పోర్చుగల్, మాల్టా, కెన్యా, ఇరాక్, కుర్దిస్థాన్ అధ్యక్షులతోపాటు మహారాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాస సుల్గే (Srinivasa Sulge) ను నియమించినట్టు ఆమె పేర్కొన్నారు.