Arizona State University: హరిజోనా స్టేట్ వర్సిటీతో అనురాగ్ ఒప్పందం

అమెరికాకు చెందిన అరిజోనా స్టేట్ వర్సిటీ (Arizona State University )తో తెలంగాణ రాష్ట్రంలోని అనురాగ్ వర్సిటీ (Anurag University) ఎంవోయూ కుదుర్చుకున్నది. హైదరాబాద్‌లో అనురాగ్ వర్సిటీ చైర్మన్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy), అరిజోనా వర్సిటీ సీనియర్ డైరెక్టర్ క్రిస్ జాన్సన్ (Johnson) పాల్గొన్నారు. విద్యార్థులు తొలుత అనురాగ్ వర్సిటీ లోని ఇంటర్నేషనల్ కాలేజీలో చదువును ప్రారంభిస్తారు. ఆ తర్వాత అమెరికా (America)కు వెళ్లి డిగ్రీ కోర్సు పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఈ ఒప్పందం తక్కువ ఖర్చుతో, అంతర్జాతీయ విద్యను అందించాలన్న తమ సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌యూ గ్లోబల్ పార్టనర్ షిప్, సీనియర్ డైరెక్టర్ క్రిస్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.