సంకీర్తనలతో ఆకట్టుకున్న మంచిర్యాల “శివప్రియ” శిష్య బృందం

అన్నమయ్య సంకీర్తనల ప్రచారంలో భాగంగా ప్రతి శనివారం పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నమయ్య స్వరార్చనలో మంచిర్యాల నుండి "శివప్రియ మ్యూజిక్ అకాడమి" గురువు "శ్రీమతి శివప్రియ ఇందారపు" గారు మరియు వారి శిష్య బృందం "శ్రీమతి పుల్లూరి సవిత, శ్రీమతి సుజాత ఈన, శ్రీమతి ఎల్లంకి రేణుక, సహస్ర శేగంటి, సంహిత ఆడ్డగూరి, హాసిత్ లేదళ్ళ, నామని ఆద్విక, రిష్విత సుంకర, అద్వైత పెండ్లి, కృష్ణదర్శిత అకినపల్లి, చంద్రహాస రావినుజల, సమన్వి శ్రీరాములు, సుదీక్ష బత్తుల, సమన్వి చింతకింది" సంయుక్తంగా ప్రఖ్యాత సంకీర్తనలను మధురంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కీ బోర్డు పై జి. శ్రీధర్, తబలా పై శ్రీనివాస్ మరియు ప్యాడ్ పై శ్రీనివాస్ వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమం లో ఆలపించిన సంకీర్తనకు భావాని తనదైనశైలిలో శోభారాజు గారు విశ్లేషణ అందించారు. అనంతరం శోభారాజు గారు కళాకారులందరికి సంస్థ జ్ఞాపికలను బహుకరించారు. చివరిగా శ్రీ అన్నమయ్య సమేత శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి హారతులిచ్చి, పసందైన ప్రసాద వితరణ చేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నమ స్వరార్చన ఉత్సవాన్ని ఉల్లాసభరితంగా జరుపుకున్నారు.