Banakacharla : గోదావరి-బనకచర్లపై .. అన్ని పార్టీలతో : మంత్రి ఉత్తమ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన గోదావరి-బనకచర్ల (Godavari- Banakacharla) ప్రాజెక్టుపై తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అఖిలపక్ష ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), కాంగ్రెస్ ఎంపీలతో పాటు, బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్‌రావు (Raghunandan Rao), బీఆర్‌ఎస్ ఎంపీ రవిచంద్ర, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) , పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి బనకచర్లపై అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నాం. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం కట్టుబడి ఉంది. గోదావరి` బనకచర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫీజిబులిలీ నివేదిక సమర్పించింది అని వివరించారు.