Adluri lakshman : మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్

సచివాలయంలో మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ (Adluri lakshman) బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్వాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయా వర్గాల సంక్షేమానికి సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. దివ్యాంగుల స్వయం ఉపాధి యూనిట్లకు రూ.5 కోట్లు మంజూరు చేశారు. దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలకు రూ.3.55 కోట్లు రివాల్వింగ్ ఫండ్ విడుదలకు ఆమోదం తెలిపారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి (Ambedkar Overseas Education Fund) ఎస్సీ లబ్ధిదారుల సంఖ్యను 210 నుంచి 500కి పెంచారు. గిరిజన విద్యా సంస్థల (Tribal educational institutions) మరమ్మతలకు రూ.79,61 కోట్లు, గిరిజన మినీ గురుకులాల నిర్వహణకు రూ.17.18 కోట్లు, మేడారం జాతర (Medaram Jatara) మిగిలిన పనులకు రూ.44.5 కోట్లు మంజూరు చేశారు. జేఈఈ, నీట్‌లో 100 మంది గిరిజన విద్యార్థులకు ప్రోత్సహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రులు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) , పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు.