MLC Kavitha: తల్లిగా ఎంతో గర్వపడుతున్నా : ఎమ్మెల్సీ కవిత

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) పెద్ద కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివర్సిటీ (Oak Forest University) నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. అమెరికాలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత, అనిల్ కుమార్ (Anil Kumar) దంపతులు హాజరయ్యారు. ఆదిత్య గ్రాడ్యుయేషన్ (Aditya Graduation) పట్టా పుచ్చుకున్న ఫొటోను కవిత సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆదిత్యా నీ చిట్టి చేతిని పట్టుకోవడం నుంచి నువ్వు డిగ్రీ పట్టా పట్టుకోవడం వరకు చూశాను. ఇది ఎంతో గొప్ప ప్రయాణం. నువ్వు చాలా కష్టపడ్డావు. ఎంతో ఎదిగావు. మేమందరం గర్వపడేలా చేశావు అని కవిత పేర్కొన్నారు. ఒక తల్లిగా ఎంతో గర్వపడుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు.