Arvind Kumar: అర్వింద్‌కుమార్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ (Arvind Kumar)కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ-కార్ రేస్ (E-Car Race) కేసుకు సంబంధించి గురువారం ఉదయం 11:30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అర్వింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు (ACB notices) ఇచ్చింది. నెలరోజులపాటు విదేశాల్లో ఉన్న అర్వింద్ జూన్ 30న హైదరాబాద్ (Hyderabad) కు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అతడికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది.